Telangana Bhu Bharathi Bill PDF : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భూ భారతి బిల్లుకు ఆమోదం తెలిపారు. వెంటనే, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ గవర్నర్ ఆమోదించిన బిల్లును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అందజేశారు. అనంతరం మంత్రి అధికారులను తక్షణమే అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇప్పటి వరకు ఇది “భూమాత పోర్టల్” అనే పేరుతో పిలవబడింది. కానీ, కొత్త శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని “భూ భారతి”గా పునఃనామకరణం చేసింది. గతంలో ధరణి పోర్టల్ 33 మాడ్యూళ్లతో కూడి ఉండేది. ఇది రైతులకు, తక్కువ చదువుకున్న వారికి తీవ్రమైన గందరగోళాన్ని కలిగించేది. ప్రతి అభ్యర్థనకు ₹1200 చెల్లించాల్సి వచ్చేది. అయితే, భూ భారతి కేవలం 6 మాడ్యూళ్లతో అమలులోకి వస్తోంది. దీని వల్ల ప్రక్రియ తేలికవుతుంది, రైతులపై మానసిక ఒత్తిడి తగ్గుతుంది.